హిజ్రాతో సహజీవనం చేసిన యువకుడు..చివరకు ఏమైందంటే!

228
- Advertisement -

తమిళనాడులోని కారైక్కాల్ దారుణం చోటుచేసుకుంది. తమిళనాడులోని కారైక్కాల్ సమీపంలోని తిరునల్లారుకు చెందిన చెందిన దిలిప్(26) అనే యువకుడికి నిరావీ(30) అనే హిజ్రాకు పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ రోజూ కలవడం, చట్టాపట్టాలేసుకుని తిరగడం చేశారు. ఒక ఆరునెలలు వీరిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు. ఈ ఆరునెలల కలయికలో వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్య సంబంధం మరింత ఎక్కువ కావడంతో దిలీప్ తల్లి తండ్రులకు విషయం తెలిసింది. దీంతో దిలీప్ ను మందలించారు నిరావానీ విడిచిపెట్టాలి అని చెప్పారు. ఎంత చెప్పినా వినకపోవడంతో దిలిప్ పై చేయి చేసుకున్నారు.

దీంతో దిలిప్ మనస్తాపం చెంది ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇంటినుండి వెళ్ళిపోయి గత కొద్దిరోజులుగా శివాని తో కారైక్కాల్‌ ఒడుదురై ప్రాంతంలో సహజీవనం చేస్తున్నాడు. అయితే వీరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నిన్న వీరు ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి ఓనర్ వాళ్లు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వనడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దిలిప్ తల్లితండ్రులు వారిని బెదిరించారా లేక వారే మనస్దాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -