విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది అందాల భామ రీతూ వర్మ. ఈమూవీ మంచి విజయం సాధించిన కానీ రీతూకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటివలే యంగ్ హీరో నిఖిల్ తో కేశవ సినిమాలో నటించింది. రీతూ తెలుగు అమ్మాయి కావడం వల్లనే ఆమెకు అవకాశాలు రావడం లేదంటూరు నెటజన్లు. రీతూ ప్రస్తుతం తెలుగులో నాని సరసన టక్ జగదీశ్ సినిమాలో నటిస్తుంది.
తాజాగా ఈ భామ తన పెళ్లి గురించి స్పందించింది. మా తల్లితండ్రులు నాకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. తాను దీనిపై ఆలోచించుకోవడానికి కాస్త సమయం కావాలని అడిగానని, తనకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు చేసుకుంటానని చెప్పింది. ఇప్పటి వరకు తనకు నచ్చిన వ్యక్తి దొరకలేదని..నచ్చితే అతడినే చేసుకుంటానని తెలిపింది. తాను మాత్రం ప్రేమ పెళ్లి చేసుకుంటానని చెప్పింది. నాకు లవ్ మ్యారేజ్ అంటే చాలా ఇష్టం అని కుదిరిలే లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పింది.