కరోనా నియంత్రణపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష..

308
Minister errabelli dayakar
- Advertisement -

కరోనా వైరస్ అదుపు, 6వ విడత హరిత హారంను విజయవంతం చేయడం, ఉపాధి హామీ నిధుల వినియోగం వంటి పాలు అంశాలపై జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ నిఖిల, ఉన్నతాధికారులతో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకోవాలి.ప్రజలను మరింత చైతన్యం చేసి, అవగాహన పరచి, కరోనాను కట్టడి చేయాలి అన్నారు. స్వీయ నియంత్రణ, క్వారంటైన్‌ని మరింత పకడ్బందీగా అమలు పరచాలి. కరోనా విస్తృతిని బట్టి, జోన్లుగా విభజించి, కరోనా బాధితులకు చికిత్స అందించాలి.అనుమానితులను హోమ్ క్వారంటెన్ చేయాలని మంత్రి సూచించారు.

ఇక ఉపాధి హామీ నిధులను సరిగా వినియోగించుకోవాలని.. కల్లా లు నిర్మితమయ్యేలా చూడాలని.. సాగు నీటి శాఖకు ఉపాధి హామీని అనుసంధానించి నందున రైతాంగానికి మరింతగా ఉపాధి హామీ ఉపయోగ పడుతుందని మంత్రి అన్నారు. ఇక 6వ విడత హరిత హారాన్ని విజవంతం చేయాలి. మనగలిగే, ఎక్కువ ఎత్తైన, మొక్కలను నాటండి.నాటిన ప్రతి మొక్క నూటికి నూరు శాతం పెరిగాలి అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

- Advertisement -