మినిస్టర్‌ క్వార్టర్స్‌లో క్లీన్ అండ్ డ్రైవ్‌…

225
srinivas goud
- Advertisement -

మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం10 గంటల10 నిమిషాల కు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ .హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో క్లీన్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షపునీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, పూలతొట్టి లోని నీటిని స్వయంగా పరిశీలించి, నీటిని తొలగించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దోమల ద్వారా సంక్రమించే అన్ని రకాల సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా మంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అవగాహన కార్యక్రమాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. డెంగ్యూ వ్యాధి నివారణ లో భాగంగా ప్రతి ఒక్కరూ వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలని మంత్రి సూచించారు.

- Advertisement -