ఎంపీ అరవింద్ బండారం బటపెట్టిన క్రిశాంక్‌..

285
TRS Leader Krishank
- Advertisement -

ఈ వీడియో ప్రతీ ఒక్కరు చూడాలి, తెలంగాణ యువత ప్రత్యేకంగా చూడాలి!.. అంటూ టీఆర్‌ఎస్‌ నాయకుడు క్రిశాంక్‌ నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ దర్మపురి అరవింద్‌ను విమర్శిస్తు కీలక వ్యాఖ్యలు చేశారు.

• నేను అడగకుండానే నాకు వివరణ ఇచ్చిన విద్య సంస్థ కాపీ నాకు పంపాలి కాని ధర్మపురి అరవింద్ కి పంపడమే మీరు తన అధికార ఆర్థిక బల ఉపయోగాన్ని గమనించాలి.

• అరవింద్ తను ఇప్పుడు ఒక లేఖ మరియు గతం లో ఒక మార్క్ షీట్ విడుదల చేశారు, అందులో స్పష్టంగా అరవింద్ ఆగస్టు – సెప్టెంబర్ 2018 లో ద్వితీయ సంవత్సర పరీక్ష రాసి పాస్ అయినట్టు చూపెట్టారు.

• అయితే UGC నియమాల ప్రకారం ప్రైవేట్ విద్యా సంస్థలు వారి పరిధి ఆ సొంతం రాష్ట్రం వరకే, ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి విద్య కు సంబంధించిన కార్యకలాపాలు చేసే అధికారం వారికి లేదు. అంటే జనార్ధన్ రాయ్ నగర్ విద్యాపీట్ రాజస్థాన్ రాజస్థాన్ పరిధిలోనే పని చెయ్యాలి . మరి అరవింద్ పరీక్ష రాజస్థాన్ లో రాశాడా ?

• ఆ విద్యాసంస్థ ఆగస్టు- సెప్టెంబరు 2018 పరీక్షల టైమ్ టేబుల్ ప్రకారం అరవింద్ కు ద్వితీయ సంవత్సరం MA Political Science పరీక్షలు 19 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు జరిగినాయి, అయితే విచిత్రం ఏంటంటే రాజస్థాన్ లో లేని అరవింద్, పరీక్షా కేంద్రం లో లేని అరవింద్ తన చివరి పరీక్ష ఇండియన్ అండ్ హర్ నేయిబర్స్ పరీక్ష రోజు ఆర్మూర్ లో డజన్ వార్త ఛానెల్ ల ముందు రాజకీయ కార్యక్రమం లో ఎలా ఉన్నారు ?

• ఇది చట్ట రిత్యా Fraud కాదా ? ఈ అన్ని ఆధారాలు పోలీస్ ముందు పెడితే అరవింద్ జైలు కు పోతాడు, కానీ రాజకీయ కుట్ర అని దొంగ ఏడుపు ఏడుస్తాడని, అరవింద్ కి ఒక సవాల్.

• తన పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి తను చెప్పేది నిజం అయితే దర్యాప్తు కోరాలి, నేను ఈ అన్ని ఆధారాలు CBI ముందు పెడుతాను.

దమ్ముందా అరవింద్ ? ఛలో CBI!. అంటు క్రిశాంక్‌ సవాల్‌ చేశారు.

- Advertisement -