ల‌ద్దాఖ్ లోని ప‌రిస్ధితుల‌పై త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్‌ సింగ్ స‌మీక్ష‌

248
rajnath singh
- Advertisement -

భార‌త్ చైనా స‌రిహ‌ద్దుల్లో ఇరు దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ అంశం పై ఇటివ‌లే అఖిల‌ప‌క్ష నేత‌ల స‌ల‌హాలు తీసుకున్నారు ప్ర‌ధాని మోదీ. అయితే లద్దాఖ్‌లోని పరిస్థితులపై త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాల అధిపతులతో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వ‌హించారు.

జల, వాయు, భూమార్గాల్లో చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. చైనా ఎలాంటి దుశ్చర్యలకు ప్రయత్నించినా ధీటుగా బదులు ఇవ్వాల‌ని అధికారుల‌కు సూచించారు మంత్రి రాజ్ నాథ్ సింగ్. చైనా సైన్యం దుస్సాహసాలకు గట్టిగా బదులివ్వడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. చైనా సరిహద్దు వద్ద వ్యూహాత్మక విధానాన్ని అవలంబించాలని నిర్ణయించారు.

- Advertisement -