ఫలక్‌నుమాలో రానా మిహీకాల పెళ్లి

357
rana
- Advertisement -

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌ రానా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తన ప్రేమ, పెళ్లి విషయాన్ని బయటపెట్టిన రానా మ్యారేజ్‌కు సంబంధించిన వార్త ఇప్పుడు టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

రానా, మిహీకాల రోకా వేడుక ఇప్ప‌టికే పూర్తి కాగా త్వరలో ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఇక దగ్గుబాటి కుటుంబసభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టులో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉంది.

కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో అతికొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో రానా పెళ్లి జరగనుంది. ఇందుకు ఫలక్ నుమా ప్యాలెస్ వేదిక కానుంది.ఆగస్టు 8న హిందూ సంప్రదాయం ప్రకారం రానా పెళ్లి జరగనుండగా త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

- Advertisement -