బర్త్ డే స్పెషల్…సీటిమార్‌ సంపత్ నంది

366
sampath nandi
- Advertisement -

ఏమైంది ఈవేళ సినిమాతో మెగాఫోన్ పట్టిన వరంగల్ కుర్రాడు సంపత్ నంది.తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది…తర్వాత రామ్ చరణ్, గోపిచంద్,రవితేజ వంటి హీరోలతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసి వైవిధ్యమైన మూవీలను తెరకెక్కిస్తు మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇవాళ సంపత్ నంది బర్త్ డే.

పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి 2010లో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం 80 లక్షలకు పైగా లాభాన్ని ఆర్జించి పెట్టింది. ఈ సినిమా విడుదలైన తర్వాత వారం రోజుల్లోనే ఏడు అవకాశాలు వచ్చాయి.

తర్వాత 2012 లో రాం చరణ్ కథానాయకుడిగా రచ్చ… 2015 లో రవితేజతో బెంగాల్ టైగర్ చిత్రాలను తెరకెక్కించాడు. ఇక 2017లో గోపిచంద్‌తో గౌతమ్ నందా తెరకెక్కించిన సంపత్ నంది ఈమూవీతో ప్రేక్షకులను మెప్పించాడు.

ప్రస్తుతం గోపిచంద్‌తో సీటిమార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కనుండగా ఆంధ్రప్రదేశ్‌ మహిళా కబడ్డీ టీమ్‌ కోచ్‌గా గోపీచంద్‌ కనిపించనున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టి సంపత్ నంది మరిన్ని హిట్ మూవీలు తీయాలని గ్రేట్ తెలంగాణ.కామ్‌ మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -