ఈ నెల 25 వ తేదీ నుండి ప్రారంభమయ్యే 3వ విడత హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇందుకు సంబంధించి ఈ నెల 22 న ఉదయం 11.00 గంటలకు ట్యాంక్ బండ్ లోని GHMC ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దిన్ తో పాటు GHMC పరిధిలోని పార్లమెంటు సభ్యులు, శాసనమండలి, శాసనసభ సభ్యులు, కార్పొరేటర్లు, ghmc జోనల్ కమిషనర్ లు, HMDA అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఆయా నియోజకవర్గాల లో, డివిజన్ లలో చేపట్టాల్సిన హరిత హారం కార్యక్రమాల వివరాలు, మొక్కల పంపిణీ కేంద్రాల వివరాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని వివరించారు.