తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 352 కొత్త కేసులు నమోదుకాగా వీటిలో 302 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ మల్కాజిగిరి 10, మంచిర్యాల 4, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల్లో 3 చొప్పున, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ రూరల్ జిల్లాల్లో 1 చొప్పున నమోదయ్యాయి.
ఇక ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 6027కి చేరగా 195 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 2531 ఉండగా 3301 మంది కరోనా నుండి కొలుకోని డిశ్చార్జ్ అయ్యారు.
కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానలు ప్రభుత్వ నిబంధనల మేరకే కరోనా చికిత్సకు ఫీజు వసూలుచేయాలని స్పష్టం చేశారు మంత్రి ఈటల రాజేందర్. ప్రజావైద్యం విషయంలో రాజీ పడేదిలేదని, ఎం తమంది బాధితులు వచ్చినా చికిత్స అందించేందుకు ప్రభుత్వ దవాఖానలు సిద్ధంగా ఉన్నాయన్నారు.