జగన్నాథ స్వామి మమ్మల్ని క్షమించడు- సుప్రీం

221
Supreme Court
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది వేల సంఖ్యలో కేసులు వెలువడుతున్నాయి. ఓ వైపు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నా.. మరోవైపు కేసులు పెరుగుతునే ఉన్నాయి. కరోనా నేపథ్యంలో స్కూల్స్‌,టెంపుల్స్‌ పూర్తిగా మూతపడ్డాయి. అయితే కొన్ని దేవాలయాలు కోవిడ్‌ ప్రమాణాలు పాటిస్తూ తెరిచెందుకు అనుమతిస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూరి జగన్నాధుడి రథయాత్ర నిర్వహించవద్దని సుప్రీంకోర్టు స్టే విధించింది. మరోవైపు జూన్ 30 వరకు ఒడిశాలో మతపరమైన ఉత్సవాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.

ఈ ఏడాది రథయాత్రను నిలిపివేయాలని కోరుతూ ఒడిశాకు చెందిన ఓ స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బొబ్డే, న్యాయమూర్తులు దినీష్ మహేశ్వరి, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. కరోనా సంక్షోభ సమయంలో అంత పెద్ద రథయాత్రకు అంగీకరిస్తే జగన్నాథ స్వామి మమ్మల్ని క్షమించడు.. అని ప్రధాన న్యాయమూర్తి బొబ్డే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యం, పౌరుల రక్షణ దృష్ట్యా చారిత్రక జగన్నాథుడి రథ యాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని ఒడిశా ప్రభుత్వాన్ని థర్మాసనం ఆదేశించింది. అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి వేడుకలు చేపట్టవద్దని, భక్తులను అనుమతించవద్దని సుప్రీం తెలిపింది.

- Advertisement -