- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల రద్దు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు మధ్యంతర ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రద్దు చేసిన రేషన్ కార్డుల పునరుద్ధరణపై హైకోర్టు ఆదేశాలను సవరించేలా చూడాలంది రాష్ట్ర ప్రభుత్వం.గత మూడేళ్లలో అనర్హులను గుర్తించి తొలిగించిన రేషన్ కార్డులను తిరిగి పునరుద్ధరించలేమని ప్రభుత్వం తెలిపింది.
కరోనా సంక్షోభ సమయంలో అందరికీ రేషన్, నిత్యవసరాలు అందించామని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఆదేశాలను సవరించాలని కోరుతూ హైకోర్టులోనే అప్లికేషన్ వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచింది. సవరణ అప్లికేషన్ను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టుకు సూచిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.
- Advertisement -