19న అఖిలపక్ష సమావేశం…

215
modi
- Advertisement -

సోమవారం భారత్‌-చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాతావరణం హీటెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల పరిస్ధితులపై చర్చించేందుకు ఈ నెల 19న అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.

సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం పంపారు. చైనా-భారత్ సరిహద్దులో జరిగిన ఈ ఘర్షణలో 20 మంది వీర జవాన్లు మృత్యువాత పడ్డారు.

- Advertisement -