హీరో సుశాంత్ ఇంట మరో విషాదం

435
sushanth
- Advertisement -

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఇంట మరో విషాదం నెలకొంది. సుశాంత్ మృతిని తట్టుకోలేక అతడి వదిన(కసిన్‌ బ్రదర్‌ భార్య) బీహార్‌లోని పూర్ణియాలో సోమవారం కన్నుముశారు. ముంబైలో సుశాంత్‌ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె బీహార్‌లో తుది శ్వాస విడిచారు.

సుశాంత్ మరణవార్త తెలిసినప్పటి నుంచే తీవ్ర విషాదంలో మునిగిపోయిన ఆమె.. అప్పటి నుంచి ఆహారం కూడా తీసుకోవడం మానేసింది. దీంతో నీరసించిపోయి బీహార్‌లోని పూర్ణియాలో కన్నుమూసింది.

ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆదివారం సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్‌ మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడని.. ఒత్తిడికి అతడు మందులు వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -