4974కి చేరిన కరోనా కేసులు…

284
telangana coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4974కి చేరాయి. గత 24 గంటల్లో 237 కొత్త కేసులు నమోదుకాగా హైదరాబాద్ పరిధిలోనే 195 ఉన్నాయి. ఇందులో 23 మంది జర్నలిస్టులు ఉన్నారు. 140 మంది జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 23 మందికి పాజిటివ్‌గా తేలింది.

మేడ్చల్‌ 10, రంగారెడ్డి 8, సంగారెడ్డి 5, మంచిర్యాల 3, వరంగల్‌ అర్బన్‌ 2, కామారెడ్డి 2, కరీంనగర్‌ 2, నిజామాబాద్‌ 2, మహబూబ్‌నగర్‌ 2, మెదక్‌, సిరిసిల్ల, అదిలాబాద్‌, సిద్దిపేట, యాదాద్రి, వరంగల్‌ రూరల్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. కరోనా తీవ్రతకు తోడు ఇతర వ్యాధులతో బాధపడుతున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో బాజిరెడ్డి కుటుంబసభ్యులు హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గన్‌మెన్‌ సురేశ్‌ కరోనాతో మృతి చెందారు.

- Advertisement -