టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా…హోం క్వారంటైన్‌లో హరీశ్…!

375
harish rao
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 4484కు చేరుకుంది. శుక్రవారం 164 కరోనా కేసులు నమోదుకాగా 9 మంది కరోనాతో చనిపోయారు. తెలంగాణలో ప్రస్తుతం 2,032 యాక్టివ్ కేసులు ఉన్నాయి.టీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ అని వైద్యులు గుర్తించారు. కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలినట్లు వైద్యులు ప్రకటించారు.

అలాగే మంత్రి హ‌రీశ్‌రావు పీఏకు కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మంత్రి హ‌రీశ్ రావుతో పాటు కుటుంబ స‌భ్యులుహోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. పీఎతో కాంటాక్ట్ ఉన్న 51 మంది సిబ్బంది నుంచి నమూనాలు సేకరించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.

ఇప్పటికే సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కూడా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా సోకడంతో శుక్రవారం మేయర్ కూడా కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. అంతకు ముందు కూడా ఓసారి మేయర్ కరోనా టెస్టులు చేయించుకోగా నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది.

- Advertisement -