కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

విద్యుత్‌ బిల్లలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ నేడు చలో సెక్రటేరియేట్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఇక తెలంగాణ సచివాలయం ముందు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు కాంగ్రెస్‌ నేతల ఇళ్ల ముందు పోలీసులు భారీగా మోహరించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క, మల్‌రెడ్డి రంగారెడ్డి లను గృహ నిర్బంధం చేశారు.

అలాగే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనుండా కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

- Advertisement -

Related Articles

Gallery

Most Popular

- Advertisement -

తాజా వార్తలు