లండన్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి, టి.ఆర్.యస్ పార్టీ కార్యనిర్వాహణ అధ్యక్షుడు కే.టీ.ఆర్‌పై గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలని, నిరాధార ఆరోపణలని ఎన్నారై టిఆర్‌యస్ తీవ్రంగా ఖండిస్తుందని ఎన్నారై టిఆర్‌యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. తానే చెపుతున్నట్టు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ అధికార హోదాలో లేడని కేవలం ప్రతిపక్ష నాయకుడిగానే ఉన్నానని, మరి తన జీవిత కాలంలో ఎన్నడైనా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజలకు, రాష్రానికి, దేశానికి ఉపయోగేపడే ఒక్క సలహానైనా ఇచ్చావా అని అడిగారు. ఎంతసేపు లావా దేవీలు, లెక్కలు, బొక్కలు తప్ప బాధ్యతగల ప్రజాప్రతినిధిగా ఏనాడైనా వ్యవహరించావా అని రేవంత్‌ను ప్రశ్నించారు అనిల్.
కేటీఆర్ నేడు దేశానికే ఆదర్శమైన నాయకుడు, ఎన్నారైలుగా మేము ఇక్కడ వివిధ రాష్ట్రాల ప్రజలతో కలిసి పని చేస్తాము, వివిధ సందర్భాల్లో కలుసుకుంటాము, మాట్లాడుకుంటాము, వారంతా కేటీఆర్ లాంటి నాయకుడు మాకుంటే బాగుండు, అలాంటి నాయకుడి సేవలు రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా దేశానికి అందించాలని వారు కోరేవారని అనిల్ కూర్మాచలం తెలిపారు. రాష్ట్ర అభివృధ్ధికోసం తన ఆరోగ్యం సైతం లెక్క చెయ్యకుండా పని చేయడం విదేశాలకు వచ్చినప్పుడు మేము ప్రత్యక్షంగా చూశామని తెలిపారు.
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఇతరుల పట్ల వ్యక్తిగతమైన ద్వేషాన్ని తగ్గిచుకొని, బాధ్యత గల ఎంపీగా తెలంగాణ ప్రజలకు అవసరమైన పనులు చెయ్యాలని, అలాగే సంవత్సర కాలంగా మల్కాజ్గిరి ప్రజలకు ఎం సేవ చేసారో ప్రజలకు చెప్పాలని అనిల్ డిమాండ్ చేశారు. లంగాణ ప్రజలే కాకుండా, ఎన్నారై సమాజమంతా కేటీఆర్ వెంటే ఉన్నారని, ఇలాంటి పస లేని పనికిరాని విమర్శలకు ప్రజలే సరైన సందర్భంలో బుద్ది చెప్తారని అనిల్ అన్నారు.