ఏ ఒక్క పథకాన్ని తీసేయం: కేటీఆర్

307
ktr siricilla
- Advertisement -

లాలు మెట్టప్రాంతమైన బదనకల్ రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గోదావరి జలాలకు హారతి ఇచ్చిన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు. యాభై ఏళ్లలో ఎన్నడు చూడని అద్భుత దృశ్యం చూస్తున్నాం….అన్నం తెలియదని వెక్కిరిచ్చిన వాళ్ల చెంపపై కొట్టేలా దేశానికే అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదుగుతున్నారని తెలిపారు.

రాష్ట్రంలోని చెరువులు, కుంటలు నింపాలన్నదే కేసీఆర్ లక్ష్యం….తంగళ్లపల్లి వాగు వానాకాలంలో కూడా ఎండిపోయేది. అక్కడ ఇప్పుడు 365 రోజులు జలాలే ఉంటాయన్నారు. మిడ్ మానేరు నిండటంతో సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. దేశంలో ఇదే రికార్డు అన్నారు.

ఈ విషయాన్ని ముస్సోరీలోని సివిల్ సర్వీస్ ఐఎఎస్ అధికారులకు పాఠాలుగా బోధిస్తున్నారు…రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 666 చెరువులు కూడా ఇదే రీతిగా నింపుతాం అన్నారు. కరెంటు మీద ఆధారపడకుండా 2 పంటలు పండించి చూపిస్తాం….తెలంగాణ వచ్చాక ఇంత త్వరగా నీళ్లొస్తాయని ఎవరూ ఆనుకోలేదన్నారు.

సముద్రానికి 82 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను 618 మీటర్ల పైన కొండపోచమ్మకు గోదావరి జలాలను సీఎం తీసుకువచ్చారన్నారు. గంగను భగీరథుడు ఆనాడు శివుని నెత్తి నుంచి భూమి మీదకు తెస్తే.. అపర భగీరథుడు కేసీఆర్ కింద నుంచి పైకి నీళ్లు తెస్తున్నారని తెలిపారు.

కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులతో జలవిప్లవం రాబోతోందని…1.25 కోట్ల ఎకరాల భూములకు సాగునీరిచ్చి రెండో హరిత విప్లవం తెస్తున్నాం అన్నారు. బంగారం పండే సారవంతమైన నేలలు ఇక్కడ ఉన్నాయి. నీళ్లు కూడా వస్తే రైతుల బతుకులు బాగవుతాయని చెప్పారు. చెరువు బాగుంటే అన్ని కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతుందన్నారు.

తెలంగాణలో 46 వేల చెరువులు ఇదే తీరులో నింపితే ఇక సమస్యే ఉండదని…చేపలు, రొయ్యల పెంపకం రూపంలో నీలి విప్లవం మన రాష్ట్రంలో రాబోతోందన్నారు. ఇంటింటికి గేదెలు, ఆవులిచ్చి శ్వేత విప్లవం తెస్తాం….యాదవ సోదరులకు గొర్రెలిచ్చి గతంలో ఉన్న కోటి గొర్రెలను రెట్టింపు చేసాం అన్నారు. మాంసోత్పత్తిలో, పౌల్ట్రీ ఉత్పత్తిలో తెలంగాణ నెంబరు వన్ అని కేంద్రమే చెబుతోందన్నారు.

ఈ విధంగా ఐదు రకాల విప్లవాలు తెలంగాణలో తెచ్చి గ్రామీణ వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతాం అని…కరోనా మహమ్మారి వల్ల అందరికీ మూతికి బట్టకట్టుకునే కాలమొచ్చిందన్నారు. బదనకల్ గ్రామానికి కావాల్సిన మౌళిక వసతులకు నిధులన్నీ కేటాయిస్తాం. …రైతు బంధు విషయంలో కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

ఏ ఒక్క పథకాన్ని ఎగ్గొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు…రైతుల కోసం ఎన్నో పనులు చేసిన కేసీఆర్ మించిన ముఖ్యమంత్రి లేరన్నారు. రైతు వేదికల ద్వారా అన్నదాతలను సంఘటితం చేసి బంగారు పంటలు పండేలా సమాలోచనలు చేసుకోవచ్చని…వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకే నియంత్రిత పంటల విధానం తెచ్చాం అన్నారు. రైతులకు మద్ధతు ధరకు మించి డబ్బులు రావాలన్నదే సీఎం ఆలోచన అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి. ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దన్నారు కేటీఆర్.

- Advertisement -