ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా నెగెటివ్..

256
CM Arvind Kejriwal
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రెండురోజులుగా జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. అయితే ఈ రోజు ఆయనకు డాక్టర్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్య పరిక్షల్లో కేజ్రీవాల్‌కు కరోనా సోకలేదని తేలింది. రిపోర్టుల్లో నెగెటివ్ వచ్చింది. దీంతో అధికార యంత్రాంగం, కేజ్రీవాల్ కుటుంబం ఊపిరిపీల్చుకుంది.

కాగా, ఆదివారం మధ్యాహ్నం నుంచి జ్వరంతో బాధపడుతోన్న కేజ్రీవాల్ వైద్యుల సూచనల మేరకు నిన్నటి నుంచి హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. తాను పాల్గొనాల్సి ఉన్న అన్ని సమావేశాలను వాయిదా వేశారు. పలు అంశాలపై ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తున్నారు. ఇక దేశంలోని కరోనా కేసుల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది.

- Advertisement -