రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకర్గ అభివృద్ధి కోసం తాను ఏడాది కాలంగా విశేషంగా కృషి చేసినట్లు ఎంపీ జి.రంజిత్‌రెడ్డి తెలిపారు. సంవత్సర కాలంతోపాటు తాను పార్లమెంట్లో చేసిన ప్రసంగాలు, నియోజవకర్గానికి సంబంధించిన రైల్వే సమస్యలు, కంది బోర్డు కోసం రైతుల పక్షాన ప్రస్తావించిన అంశాలు, ఫార్మా సిటీ ఏర్పాటు కోసం ప్రయత్నం చేసిన అంశాలు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు వివరించారు. “అభివృద్ధి పరమావధిగా” చేవెళ్ల పార్లమెంట్ పరిధిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన వంతు లక్ష్యంగా ముందుకు వెళుతున్న కేటీఆర్‌కు భవిష్యత్తు ప్రగతి ప్రణాళికపై రూపొందించిన ఓ నివేదిక సమర్పించారు.
తప్పకుండా చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఉంటుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని ఎంపీ రంజిత్ వెల్లడించారు. అభివృద్ధి – అందుబాటు అన్న నినాదంతో ముందుకు తాను భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఉండి ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.