రాజకీయాల్లోకి రానా….

218
Rana Daggubati Political entry
- Advertisement -

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దగ్గుపాటి రానా లీడర్‌ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. ఈసినిమాతో మంచి సక్సెస్‌ను కూడా అందుకున్నాడు రానా. ఒక యువనాయకుడు సీఎం అయితే రాష్ట్రం ఎలా ఉంటుంది అనే కాన్సెఫ్ట్‌ బాగుడడంతో…. ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యింది.

తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రానా మళ్లీ లీడర్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈసినిమాకి “నేనే రాజు నేనే మంత్రి” అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్‌ అనంతపురంలో జరుగుతుంది. మరికొన్ని రోజులుపాటు అక్కడే ఈ సినిమా షూటింగ్‌ చేయనున్నారు….ఓ పొలిటికల్‌ లీడర్‌గా తన పార్టీ ప్రచారంలో రానా ఉత్సాహంగా పాల్గొంటున్న సన్నివేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు. కొత్త సంవత్సరం తొలిరోజు షూటింగ్‌లో ఫస్ట్‌ ఫోటో అంటూ రానా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

Rana Daggubati Political entry

ఈసినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను తమిళనాడులోని కరైకుడి ప్రాంతంలో చిత్రీకరించారట….ఇప్పుడు పొలిటికల్‌ సీన్స్‌ను అనంతపురంలో తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో రానా సరసన కాజల్‌అగర్వాల్‌…కేథరిన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే బహుబలి-2, ఘూజీ సినిమాల షూటింగ్‌ పూర్తి చేసిన రానా ఈసినిమాలో బిజీగా ఉన్నాడు న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం కాస్త విరామం తీసుకున్న రానా తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నాడు. లీడర్‌ తర్వాత రానా మరోసారి పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో నటిస్తుండటం,పైగా ప్రేమకథల స్పెషలిస్ట్‌ తేజ దీనికి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వ్యక్త మవుతున్నాయి.

- Advertisement -