టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో….రోజుకో కొత్త ఆఫర్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా ప్రిపెయిడ్ వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.
రూ.401 నెలవారీ రీచార్జి ప్లాన్ లేదా రూ.2599 వార్షిక ప్లాన్ లేదా రూ.612, రూ.1208 డేటా వోచర్లు.. వీటిలో ఏదో ఒక ప్లాన్ ను ఎంచుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
రూ.401 ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. దీంతోపాటు రోజుకు 3 జీబీ చొప్పున 28 రోజుల పాటు డేటాను వాడుకోవచ్చు.జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్…. జియో టు నాన్ జియో 1000 ఉచిత నిమిషాలు టాక్ టైం పొందవచ్చు.
మరోవైపు జియోలో ఫేస్‌బుక్‌తో ప్రారంభమైన పెట్టుబుడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి జియోలో భారీగా పెట్టుబడులు పెట్టడంపై ముఖేష్ అంబానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు.