కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచదేశాల ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింది. ముఖ్యంగా భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై కరోనా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. పారిశ్రామిక,ఆటో మొబైల్ ఇలా అన్నిరంగాలు దెబ్బతిన్నాయి.ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి కూడా కొలుకోలేని దెబ్బపడింది.
లాక్ డౌన్ 5.0 పేరుతో మరిన్ని సడలింపులు ఇచ్చిన థియేటర్‌ల ఓపెన్‌పై మాత్రం సడలింపు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో థియేటర్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్ధితి నెలకొంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కీలకనిర్ణయం తీసుకున్నారట.
బడ్జెట్ కోతలో భాగంగా నటీనటుల రెమ్యూనరేషన్ తగ్గించాలని భావిస్తున్నారట దర్శకధీరుడు. ప్రొడక్షన్ బడ్జెట్‌లో ఎలాంటి మార్పు లేకుండా నటీనటుల రెమ్మ్యూనరేషన్ పరంగా కాస్త కొత్త పెట్టాలని చూస్తున్నారట. ఇలా అయితేనే ఔట్‌పుట్‌పై ప్రభావం పడదని, బడ్జెట్ కోతలో రెమ్మ్యూనరేషన్ తగ్గించుకోవడమే ముఖ్య సూత్రమని ఆయన తన యూనిట్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కాని టీ టౌన్‌లో మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.