దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కొంత మంది ప్రచారం చేస్తున్నారు…ప్రాంతియతత్వాన్ని రెచ్చ గొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అసెంబ్లీలోని కమిటీ హాల్ లో మీడియాతో మాట్లాడిన గుత్తా…దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడిగా నిజాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
శ్రీశైలం బ్యాక్ వాటర్ కు సంబంధించి సొరంగం తవ్వాల లేక లిఫ్ట్ ఏర్పాటు చేయాలనేదానిపై అప్పటి సీఏం చంద్రబాబు 6గురు సభ్యులతో కమిటీ వేశారని..ఆ కమిటీ లిఫ్ట్ ఏర్పాటు చేయాలని సూచించింది.పనులు కూడా ప్రారంబించారని చెప్పారు.
కానీ వైయస్ ఆర్ హాయాం లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ చేపట్టి నప్పుడు తెలంగాణ వారు గొడవ చేస్తారని..శ్రీశైలం సొరంగం పనులు కూడా ప్రారంబించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వాచ్చాక.. మొదటి సంవత్సరంలోనే శ్రీశైలం సొరంగం పనుల మీద అసెంబ్లీ కమిటీ హాల్ లో అన్ని పక్షాలతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారని గుర్తుచేశారు సుఖేందర్ రెడ్డి.
2005లో జయప్రకాష్ కంపెనీ కి పనులు అప్పిగించారు 943కోట్ల రూపాయలు ఈ సొరంగం పనుల కోసం ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. ఇంకా పది కిలోమీటర్ల సొరంగం పని మాత్రమే మిగిలిందని…2009 లో శ్రీశైలం ప్రాజెక్ట్ కు వాటర్ ఫ్లో ఎక్కువ కావడంతో గేట్లు ఎత్తివేశారు దీంతో వరద అంతా సొరంగం వైపు రావడంతో సొరంగం మునిగిపోయి మిషనరీ అంతా పాడైపోయిందన్నారు.
ఇది పకృతి వైపరీత్యం కాదు. మానవ తప్పిదం అనీ నేను అప్పుడే చెప్పానని…ఈ సమయంలో పనులు చేయలేమని జయప్రకాష్ కంపెనీ చెప్తే మిషనరీ రిపేరు ఖర్చులకు 200కోట్ల రూపాయలు ప్రభుత్వం జయప్రకాష్ కంపెనీకి ఇచ్చిందన్నారు. 16కోట్ల కరెంటు బిల్లు బకాయి జయప్రకాష్ కంపెనీ కట్టాలి కానీ ఆ కంపెనీ కట్టలేని పరిస్థితిలో ఉంది .అయిన కరెంటు ఆపకుండా చిత్తశుద్ధి తో పనులు చేయిస్తున్నాం అన్నారు.
పోతిరెడ్డిపాడు ను అప్పుడు జానారెడ్డి కానీ మిగతా కాంగ్రెస్ నేతలు ఎవరు వ్యతిరేకించలేదని…నోరువిప్పుతే పదవులు పోతాయి అనే భయంతో అప్పటి కాంగ్రేస్ నేతలు పని చేశారన్నారు. తాను ఎంపీ గా ఉన్న భయపడకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడానన్నారు.
డిండి రిజర్వాయర్ పనులు 93శాతం పూర్తయ్యాయని చెప్పిన గుత్తా…కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే తెలంగాణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిందని…తెలంగాణ వచ్చాక.. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తుందన్నారు.
ఇప్పుడు విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయించలేదన్నారు.
అధికారం ఉన్నప్పుడు నోరు మూసుకొని కూర్చొని ఇప్పుడు మాట్లాడితే ఏం లాభంకోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడితే తలాతోక ఉండదు. అసత్యాలు, అబద్ధాలు తప్ప ఆయన నోట మరో మాట రాదన్నారు.
ఏపీ ఇచ్చిన 203 జీవో సరైంది కాదు. నాగార్జున సాగర్ ను నిర్వీర్యం చేయడమే ఈజోవో ఉద్దేశ్యం అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నంత కాలం ఏపీ ప్రభుత్వం ఒక్క చుక్క నీరుని అక్రమంగా తీసుకుపోలేదని…ప్రతిపక్ష నేతలు అసత్యాలు ప్రచారం చేయడం మానుకొని ప్రభుత్వానికి మంచి సలహాలు,సూచనలు ఇస్తే మంచిదన్నారు.