రైతును రాజు చేయడమే సీఎం లక్ష్యం: నిరంజన్ రెడ్డి

402
niranjan reddy
- Advertisement -

రైతులకు ఆర్ధికభద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. చేవెళ్లలోని నియోజకవర్గంలో నియంత్రితసాగుపై రైతులకు అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి…మూడేళ్లలో కాళేశ్వరం పూర్తిచేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు.

రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు.తెలంగాణ వచ్చినంక కరెంట్,తాగు,సాగు నీటి సమస్య పరిష్కారమైందన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదన్నారు. రైతులను చైతన్యవంతులను చేసేందుకు రైతు వేదికలు ఉన్నాయన్నారు.

ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ టాప్ దేశంలోనే టాప్ పొజిషన్‌లో నిలిచిందన్నారు. ప్రజలకు అవసరమైన పంటలనే పండించాలి…డిమాండ్ ఉన్న పంలను పండిస్తే రైతులకు లాభం జరుగుతుందన్నారు.

తెలంగాణ పత్తి ప్రపంచంలోనే శ్రేష్టమైందన్న నిరంజన్ రెడ్డి…మనదేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయని…ప్రపంచాన్ని సాకగలిగే శక్తి మనకు ఉందన్నారు.

- Advertisement -