- Advertisement -
మిడత పేరు వింటేనే జనం హడలిపోతున్నారు. ఏ మిడత కనిపించినా… ఇవి అవే మిడతలని భయపడుతున్నారు. అయితే మన వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండటం, ఎప్పటికప్పుడు అనుమానాలు నివృత్తి చేస్తుండటంతో రైతులు, ఇతర ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బీ జి కొత్తూరు గ్రామంలో మిడతలు దండు కనిపించింది.
అవి జిల్లేడు చెట్లపై ఉండటాన్ని చూసిన గ్రామస్తులు మరియు రైతులు వెంటనే అగ్రికల్చర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తక్షనం స్పందించిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఇవి పంటలపై దాడిచేసే మిడతల కావని రైతులకు తెలిపారు. ఈ మిడతల వల్ల ఎలాంటి పంటనష్టం వాటింల్లదని, ఎవరు బయపడాల్సిన పని లేదని రైతులకు తెలిపారు.
- Advertisement -