భారీ రేటుకు ‘లవ్‌స్టోరి’ శాటిలైట్ రైట్స్..!

781
lovestory
- Advertisement -

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా లవ్ స్టోరీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

ఈ అంచనాలకు తగ్గట్టే సినిమా రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయినట్లు సమాచారం. శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ హక్కులు కలిపి రూ.16 కోట్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది.

ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోండగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

కులం కాన్సెప్ట్ నేపథ్యంలో పూర్తిగా తెలంగాణ స్లాంగ్‌తో వస్తోంది ఈ మూవీ. ఇక ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తెలంగాణ స్లాంగ్‌ను నేర్చుకున్నారు చైతూ. ఇప్పటికే ఫిదాలో తెలంగాణ యాసతో అదరగొట్టిన సాయిపల్లవి ..చైతూతో కలిసి ఈ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

- Advertisement -