- Advertisement -
చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మురికి కాల్వలను శుభ్రం చేశారు. బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఇళ్ల మధ్య ఉన్న గడ్డిని తొలగించాలన్నారు.
నీరు నిలువకుండా చూడాలని అన్నారు. నీరు నిలిస్తే దోమలకు స్థావరంలా ఏర్పడి దోమలు పెరిగే అవకాశం ఉంటుందని వాటి ద్వారా విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంటుందని అన్నారు. కాబట్టి ప్రజలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు.
- Advertisement -