తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈరోజు ఒకేరోజు భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే 199 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,698కు పెరిగింది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల ఐదుగురు మృతి చెందారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 122, రంగారెడ్డి(40), మేడ్చల్(10), ఖమ్మం(9), మహబూబ్‌నగర్(3), జగిత్యాల(3), మెదక్(3), వరంగల్ అర్బన్(2), సూర్యాపేట(1), నిర్మల్(1), యాదాద్రి(1), జనగామ(1) జిల్లాల్లో ఇవాళ కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ ముగ్గురు వలసదారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
తెలంగాణలో ఇప్పటి వరకూ 1,428 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,188 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం 82 మంది కరోనా బారినపడి మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.