సమాజాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: నామా

689
Nama Nageswara Rao
- Advertisement -

సీజనల్ వ్యాదుల నివారణకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మంచి ఫలితాలను ఇస్తోంది. ప్రజలకు అవగాహన కల్పించడముతో పాటు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు ఆచరించి చూపిస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందించి హైదరాబాద్‌లోని తన ఇంట్లో స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు.

ఆయన పూల కుండీలు, పరిసరాలు శుభ్రం చేసి నిల్వ నీటిని పారబోశారు. ఆదివారం 10 గంటలు 10 నిమిషాలు కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో నిర్వహించారు ఎంపీ నామ. సామాజిక బాధ్యతతో ప్రజల్ని చైతన్య పర్చి , సీజనల్ వ్యాధులను తరమాలని ఎంపీ నామ పిలుపునిచ్చారు. సమాజాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు నామా.

- Advertisement -