బోరబండలో బాబా ఫసీయుద్దీన్ ప్రత్యేక ప్రార్ధనలు…

306
baba fasiyuddin
- Advertisement -

హైదరాబాద్ బోరబండలోని తన నివాసంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బో తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ,ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు ఆయన వెల్లడించారు.

కరోనా వైరస్ నేపథ్యంలో సెంటర్ వక్ఫ్ బోర్డ్,స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఇచ్చిన గైడ్ లైన్స్ కు అనుగుణంగా అందరూ ముస్లిం సోదరులు ఇండ్లలోనే నమాజ్ చేసుకున్నారని తెలిపారు.అల్లా దీవేనతో మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశామని వెల్లడించారు.

కరోనా వైరస్ తో పోరాడుతున్న వారు త్వరలో తిరిగి కోలుకోవాలని అల్లాను వేడుకున్నామని… కరోనా వైరస్ ఈ రాష్ట్రాన్ని ,దేశాన్ని ,ప్రపంచాన్ని త్వరలోనే విడిచి వెళ్లాలని ప్రత్యేక ప్రార్ధనలు చేశామని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ,హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశామని..కరోనా వైరస్ మీద అలుపెరుగని పోరాటం చేస్తున్న వైద్యులు ,పోలీస్ సిబ్బంది ,పరిశుద్య సిబ్బందికి ధైర్యం ప్రసాదించాలని యావత్ ముస్లిం సమాజం ఇవాళ అల్లాను ప్రార్ధించినట్లు తెలిపారు.

- Advertisement -