- Advertisement -
భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
96 ఏళ్ల బల్బీర్ సింగ్.. తన కూతురు, మనవడితో కలిసి చండీగఢ్‌లో నివాసముంటున్నారు. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత కొలుకోని డిశ్చార్జ్ అయిన కొద్దిరోజులకే మళ్లీ ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో తిరిగి ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.
భారత హాకీ జట్టు అనేక విజయాల్లో బల్బీర్ సింగ్ పాలుపంచుకున్నారు. 1948, 1952, 1956లలో ఒలింపిక్స్‌లలో స్వర్ణం గెలుపొందిన భారత జట్టులో బల్బీర్ సభ్యుడు.
- Advertisement -