సీఎం కేసీఆర్ తెలంగాణను క్రీడా హబ్‌గా మార్చేందుకు కృషిచేస్తున్నారని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.హైదరాబాద్ రవీంద్ర భారతిలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్..సీఎం కేసీఆర్ క్రీడా రంగంపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు.
అందులో భాగంగానే వేసిన సబ్ కమిటీ కోసం 911 జీవోను విడుదల చేశారని…యువత ను మంచి మార్గంలో పెట్టేందుకు స్పోర్ట్స్ ఉపయోగ పడుతుందన్నారు. గత ప్రభుత్వాల కాలంలో క్రీడారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు.
ఒలింపిక్స్ మెడల్ గెలిచిన క్రీడాకారులకు భారీగా ప్రోత్సాహకాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. 97 నియోజక వర్గాల్లో ఇప్పటికే 34 స్టేడియాలు నిర్మించాం.. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు.
రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడించారు. వరంగల్ లోను అత్యాధునిక సింథటిక్ ట్రాక్ ను ప్రారంభించబోతున్నాం అని…క్రీడాభివృద్ది కోసం వేసిన కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారని చెప్పారు.
సబ్ కమిటీ క్రీడాభివృద్ది పై పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందిస్తోందని…రెండు నెలల్లో సబ్ కమిటీ విధి విధానాలతో కూడిన ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఉన్న సదుపాయాలతోనే ఎందరో గొప్ప క్రీడాకారులు వెలుగులోకి వచ్చిన రాష్ట్రం మనదన్నారు.
త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుందని…గతంలో శామిర్ పెట్ లో గోల్ఫ్ కోర్ట్ పేరిట 150 ఎకరాల స్థలాన్ని అన్యాక్రాంతం చేశారని… ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ఉపయోగం చేసుకుంటాం అన్నారు.
మంత్రి కేటీఆర్ సైతం స్పోర్ట్స్ కు పెద్ద పీట వేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని…రాబోయే స్పోర్ట్స్ పాలసీ లో క్రీడలతో సంభందం ఉన్న అందరి అభిప్రాయాలు తీసుకుంటాం అన్నారు. హైదరాబాద్ లో మేజర్ టోర్నీ నిర్వహించేందుకు సబ్ కమిటీ లో చర్చిస్తాం అన్నారు.