సమగ్ర వ్యవసాయ ప్రణాళిక సిద్ధం..

364
niranjan reddy
- Advertisement -

సమగ్ర వ్యవసాయ ప్రణాళిక సిద్ధమయిందని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి . రైతుల కష్టం లాభదాయకం కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వరి 41,76,778 లక్షల ఎకరాలు, కందులు 12,51,958 లక్షల ఎకరాలు, సోయాబీన్ 4,08,428 లక్షల ఎకరాలు, పత్తి 65 లక్షల ఎకరాలు, జొన్న , పెసలు, మినుములు, ఆముదం, వేరుశనగ, చెరుకు తదితర పంటలు మొత్తం వానాకాలంలో కోటీ 30 లక్షల ఎకరాలలో పంటల సాగుకు అంచనా వేశారనిచెప్పారు.

రైతులను జాగృతం చేసే ప్రయత్నంలో వ్యవసాయ శాఖ ఉందని.. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తేనే రైతులకు లాభం అన్నది తెలియజెప్పాలన్నారు. వానా కాలానికి కేంద్రం 22.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించిందని… విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచామని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు సమగ్ర వ్యవసాయ విధానం అమలుకు నిరంతర శ్రమిస్తామన్నారు నిరంజన్ రెడ్డి.

- Advertisement -