- Advertisement -
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా కె రైతులు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా పంటలు వేస్తామని, రైతుల లాభసాటి వ్యవసాయం కోసం ముఖ్యమంత్రి కి మేముసైతం అంటూ వ్యవసాయక్షేత్రం లో రైతులందరూ సర్పంచ్ గాడ్గే మీనాక్షి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎంపీటీసీ గాడ్గే సుభాష్ , తిరుపతి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -