ఆర్టీసీ బస్సులో మంత్రి ఇంద్రకరణ్ ప్రయాణం..

347
indrakarn reddy
- Advertisement -

నిర్మల్ పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ చౌరస్తా నుండి మంచిర్యాల చౌరస్తా వరకు ఎమ్మెల్యే రేఖా నాయక్‌తో కలిసి బస్సులో ప్రయాణించిన ఇంద్రకరణ్‌ ప్రయాణికులతో ముచ్చటించారు. కొంద‌రు ప్ర‌యాణికుల‌కు మంత్రి స్వ‌యంగా టిక్కెట్లను అంద‌జేశారు.

ప్ర‌భుత్వం లాక్ డౌన్ స‌డ‌లించిన‌ నేప‌థ్యంలో ప‌ట్ట‌ణంలోని దుకాణాలను తెరిచార‌ని, ఆర్టీసీ బ‌స్సుల‌ను కూడా న‌డిపిస్తున్నామ‌న్నారు. బ‌స్టాండ్ ను ప‌రిశుభ్రంగా ఉంచ‌డంతో పాటు ప్ర‌యాణికుల‌ను శానిటైజ‌ర్ల‌ను అందుబాటులో ఉంచామ‌ని తెలిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఇంద్రకరణ్… కరోనా మహమ్మారి నియంత్ర‌ణ‌కు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ప్రజలందరూ భౌతిక దూరం..పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. వ్యాపారులు, ప్రజలంతా నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ణప్తి చేశారు.

- Advertisement -