దేశంలో 61,149 కరోనా యాక్టివ్ కేసులు…

174
coronavirus
- Advertisement -

దేశంలో ప్రస్తుతం 61,149 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య,సంక్షేమ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌తో 140 మంది ప్రాణాలు కొల్పోయారని 5611 కొత్త కేసులు నమోదయయ్యాయని తెలిపింది.

ఇక ఇప్పటివరకు దేశంలో కరోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 106750గా న‌మోదు కాగా 3303 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో కొత్త‌గా 54 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో పాజిటివ్ సంఖ్య 1573కు చేరుకున్న‌ట్లు ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ కుమార్ తెలిపారు.

తెలంగాణ‌లో కొత్తగా 42 కేసులు న‌మోదు కాగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1634కు చేరుకుంది. ఇప్పటివరకు 1011 మంది కోలుకోగా 585 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

- Advertisement -