కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

201
- Advertisement -

కరోనా మహమ్మరితో ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పాస్టర్ లకు బియ్యం, నిత్యవసర సరుకులను ఎమ్మెల్యే భాస్కర్ రావుతో కలిసి సుఖేందర్ రెడ్డి పంపిణీ చేశారు.

Gutha Sukender Reddy About Corona

కరోనా అపత్కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో 87 లక్షల కుటుంభలకు రేషన్ బియ్యం, ఆర్ధిక సాయం అందజేసారని అన్నారు.పలు స్వచ్ఛంద సంస్థలు, నాయకులు, పేదలకు అండగా వుండడం అభినందనీయమని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.లాక్ డౌన్ సడలింపులు చేసిన ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎవ్వరికీ వారు స్వీయ క్రమశిక్షణ పాటించి కరోనాను ఎదుర్కోవాలని సుఖేందర్ రెడ్డి కోరారు.

- Advertisement -