కరోనా అప్ డేట్స్….

242
covid 19
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు ఈ మహమ్మారి 213 దేశాలకు విస్తరించగా 49.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 3.24 లక్షల మందికి పైగా మృతి చెందగా.. 19.56 లక్షల మంది బాధితులు కోలుకున్నారు.

ఇక అమెరికాలో 15.70 లక్షలకు పైగా కరోనా బాధితులు ఉండగా 93,533 మృతి చెందారు. రష్యాలో 2.99 లక్షల మంది బాధితులు, 2,837 మంది మృతి చెందారు. ఇటలీలో 2.26 లక్షలకు పైగా బాధితులు, 32,169 మంది మృతి చెందారు.

తెలంగాణలో 1634 పాజిటివ్ కేసులు నమోదుకాగా మంగళవారం ఒక్కరోజే 42 కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 32 ఉన్నాయి. ఇక ఇప్పటివరకు 38 మరణాలు సంభవించగా ఇప్పటివరకు 1011 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 585.

- Advertisement -