లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఉదయాన్నే ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున డిపోలకు చేరుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి,అచ్చంపేట,కొల్లాపూర్,నాగర్కర్నూల్, 4 డిపోల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.
మాస్కులు ధరిస్తేనే బస్సు ప్రయాణం చేసేలా అనుమతిస్తున్నారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటిస్తూ శానిటేజర్ తప్పనిసరి చేసేలా ఆర్టీసీ చర్యలు తీసుకుంది.
57 రోజుల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. సూర్యాపేట డిపో నుంచి 78 బస్సులను ఆర్టీసీ నడుపుతున్నది. నల్లగొండ రీజియన్‌లో 400 బస్సులు రోడ్డెక్కాయి. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం నుంచి వచ్చే బస్సులు హయత్‌నగర్ వరకు రానున్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని తొమ్మిది డిపోల నుంచి 761 బస్సులు రోడ్డెక్కనున్నాయి. మహబూబ్ నగర్ డిపో బస్సులు ఆరాంఘర్ వరకు రానున్నాయి. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ డిపోల బస్సులు పహాడీషరీఫ్ వరకు వస్తాయి.