జర్నలిస్టుల పాత్ర కీలకం- అర్వింద్ కుమార్

273
Arvind praises Journalists
- Advertisement -

కరోనా వ్యాప్తి నివారణలో ప్రజలను చైతన్య పరచడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ అన్నారు. లాక్ డౌన్ సమయంలో ముందు వరుసలో ఉండి జర్నలిస్టులు పనిచేస్తున్నారని కితాభిచ్చారు. కరోనా సమయంలో కూడా అనుక్షణం వార్తలను అందిస్తున్న జర్నలిస్టులకు నోవార్టీస్ అనే ప్రైవేటు సంస్థ సహకారంతో కరోనా మెడికల్ కిట్లను సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ జర్నలిస్టులకు పంపిణీ చేశారు.

కరోనా విషయంలో మీడియా ప్రజలను ఎంతగానో అవగాహన కల్పిస్తోందని… అదిగమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా…. వేగగంగా కరోనా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. మాస్కులు, శానిటైజర్లు గల 150 కరోన సేప్టి కిట్లను జర్నలిస్టులకు అందించారు. ఇప్పటి వరకు మొత్తం 650 మందికి కిట్లను అందించినట్లు ఆయన వివరించారు.

- Advertisement -