నేటి నుండి బస్సు సర్వీసులు: సీఎం కేసీఆర్

313
kcr
- Advertisement -

నేటి నుండి అన్ని బస్సులు నడపనున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. కేబినెట్ సమావేశం అనంతరం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం..హైదరాబాద్‌ నగరంలో సిటీ బస్సు సర్వీసులు నడవవని తెలిపారు. ఆటోలు, ట్యాక్సీలు హైదరాబాద్‌లో నడపవచ్చన్నారు.

సెలూన్లు రాష్ట్ర వ్యాప్తంగా తెరచుకోవచ్చన్నారు. కంటైన్‌మెంట్ ఏరియాల్లో ఏ షాపు తెరవడానికి వీలు లేదన్నారు. ఈ కామర్స్ వంద శాతం నడుస్తాయన్నారు సీఎం. ఆర్టీసీ బస్సులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నడుస్తాయని చెప్పారు.

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు యధావిధిగా నడుస్తాయని తెలిపారు సీఎం. అన్ని పరిశ్రమలు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నడుపుకోవచ్చన్నారు.రాష్ట్రమంతా కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుందన్నారు. అన్నిమతాల ప్రార్ధన మందిరాలు బంద్‌లోనే ఉంటాయన్నారు.

- Advertisement -