వెల్ డన్ శ్రీనన్న- మంత్రి కేటీఆర్

370
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త జీహెచ్ఎంసీ ప్రధాన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఈ సందర్భంగా గత 56 రోజులుగా ఉప్పల ఫౌండేషన్ తరపున శ్రీనివాస్ గుప్త చేస్తున్న కార్యక్రమాలను కేటీఆర్‌కి వివరించారు. డాక్టర్లకు, పోలీసులకు, జర్నలిస్టులకు సేఫ్టీ కిట్లు అందిస్తున్నామని, వలస కూలీలకు, పేద ప్రజలకు నిత్యావసరాలు ఇస్తున్నామని, అలాగే నిత్యం 2వేలమందికి, వివిధ ఫౌండేషన్లకు భోజనాలు అందిస్తున్నామని తెలిపారు. ఉప్పల ఫౌండేషన్ తరపున చేస్తున్న కార్యక్రమాలను కేటీఆర్ అభినందించారు. వెల్ డన్ శ్రీనన్న అంటూ కొద్దిసేపు ముచ్చటించారు.

Minister KTR Praises Uppala Srinivas Gupta

అలాగే ఈరోజు జీహెచ్ఎంసీ సిబ్బందికి కరోనా కిట్లను అందజేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త కేటీఆర్‌కి కరోనా కిట్‌ను అందించటం జరిగింది. కిట్‌లోని కరోనా గార్డ్, శానిటాయిజర్, గ్లోవ్స్, మాస్క్ లను కేటీఆర్ పరిశీలించి ప్రశంసించారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఐవీఎఫ్ నాయకులు చేస్తున్న కార్యక్రమాలను, ఉప్పల ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలను మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్త కుమారులు సాయి కిరణ్ మరియు సాయితేజ పాల్గొన్నారు.

- Advertisement -