ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ రివ్యూ..

314
puvvada ajay
- Advertisement -

తెలంగాణ ఆర్టీసీ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ప్రజారవాణాకు కేంద్రం అనుమతిచ్చిన నేపథ్యంలో బస్సులు నడిపే విషయమై అధికారులతో చర్చించారు పువ్వాడ.

గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులు తిరిగేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. బస్సుల్లో 50 శాతం సీటింగ్ సామర్థ్యం వరకే ప్రయాణికులు ఎక్కడానికి అనుమతించేలా శానిటైజర్లు వాడటం లాంటి చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు.

బస్సు ఎక్కే వారు కచ్చితంగా మాస్కులు వాడాలనే నిబంధన విధించనున్నారు. దీనిపై ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ బస్సులు నడిస్తే హైదరాబాద్ శివార్ల వరకు ఆర్టీసీ బస్సులు నడిచే అవకాశం ఉంది.

- Advertisement -