ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన చూసి,టిఆర్ఎస్ ప్రభుత్వం అమలుపరుస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నిజామాబాద్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు బీజేపీ కార్పొరేటర్లు,నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరడం శుభపరిణామం అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.శుక్రవారం హైదరాబాద్‌లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన సాయివర్ధన్ 9వ డివిజన్,విక్రం గౌడ్ 8వ డివిజన్, బట్టు రాఘవేందర్ 50వ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు,పలువురు బీజేపీ నాయకులు మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి పలువురికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదల పెన్నిధిగా నిలిచారన్నారు.రాష్ట్రంలో అన్ని రంగాలను అభివృద్ధి చేసి జనరంజక పాలన అందిస్తున్నారన్నారు.దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించిన రైతు బాంధవుడు టిఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.టిఆర్ఎస్ ప్రభుత్వం,కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు నచ్చి,ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేసేందుకు వివిధ పార్టీల నేతలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.మున్సిపల్ శాఖ మంత్రి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పట్టణాల అభివృద్ధి కోసం అవిరామంగా కృషి చేస్తున్నారన్నారు.
టిఆర్ఎస్ పార్టీలో చేరిన నిజామాబాద్ కార్పొరేషన్ కు చెందిన బీజేపీ కార్పొరేటర్లు,నాయకులకు జిల్లా టిఆర్ఎస్ పార్టీ తరపున మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తమ డివిజన్ల అభివృద్ధి కోసం,ప్రభుత్వ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని,మీ డివిజన్ల అభివృద్ధి కి మాది భరోసా అని చెప్పారు.
అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి పాటు పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,మాజి ఎంపీ కవితమ్మ నాయకత్వంలో పనిచేసేందుకు పలువురు నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఇవాళ నిజామాబాద్ కార్పొరేషన్ కు చెందిన బీజేపీ కార్పొరేటర్లు ముగ్గురు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారని తెలిపారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి కోవిడ్-19 నిర్మూలన కోసం జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. జిల్లాలో కరోనాను కట్టడి చేసేందుకు కృషి చేశారని తెలిపారు. మంత్రి పనితీరు వల్ల జిల్లా ప్రజలకు భరోసానిచ్చారని తెలిపారు.నిజామాబాద్ టౌన్‌లో వైరస్ విస్తరించకుండా వారానికి మూడు,నాలుగు రోజులు జిల్లాలోనే ఉంటూ కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా కృషి చేసారని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నేతలు పాల్గొన్నారు.