- Advertisement -
హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. కరోనాతో కొంతకాలంగా నిఖిల్ పెళ్లి వాయిదా పడుతు వస్తుండగా తాజాగా ఇవాళ ఉదయం నిఖిల్ పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.
శామీర్ పేటలోని ఓ ప్రైవేట్ అతిథిగృహంలో ఉదయం 6.31 నిమిషాలకు నిఖిల్ వివాహం జరిగింది. పంచభూతాల సాక్షిగా డాక్టర్ పల్లవి వర్మతో ఏడడుగుల వేశాడు.
ఫిబ్రవరి 3న పల్లవి వర్మతో నిఖిల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తొలుత ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, లాక్ డౌన్‌తో మే 14కి వాయిదా పడింది. దీంతో ఇవాళ అతి కొద్ది మంది అతిథుల మధ్య నిరాడంబరంగా హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుక జరిగింది.
- Advertisement -