మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న చిరు తాజాగా ఒడిశా పోలీసులతో వీడియో కాల్లో మాట్లాడారు. లాక్డౌన్ వల్ల ఆకలితో అలమటిస్తోన్న ఓ మతి స్థిమితం లేని మహిళకి స్వయంగా అన్నం తినిపించిన ఒడిశా మహిళా పోలీసు శుభశ్రీని అభినందించారు. అందరికీ స్ఫూర్తివంతంగా నిలిచారని కొనియాడారు.
మతి స్థిమితం లేని ఓ మహిళకి భోజనం తినిపించిన మిమ్మల్ని చూసి నా మనసు చలించిపోయింది. అప్పటినుండి మీతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తున్నాని తెలిపారు. చాలా మందికి స్ఫూర్తివంతంగా నిలిచారని అభినందనలు తెలిపారు.
ఇందుకు బదులిచ్చిన శుభశ్రీ పోలీసులంటే లా అండ్ ఆర్డర్ కాపాడడం మాత్రమే కాదు.. సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. మీరు మెగాస్టార్ మాత్రమే కాదు.. చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు.
#Megastar @KChiruTweets calling a police official #Subhasri to appreciate her kindness and immediate help to a woman who can't even eat food. #Gratitude #Respect pic.twitter.com/FJh2TLQQ5d
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 12, 2020