నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

213
mla marri janardhan reddy distributes groceries
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు.. బిజనపల్లి మండలంలోని వసురాం తండాలో 125 మంది గిరిజనులకు నిత్యావసర సరుకులు, కూరగాయలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి,డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి పంపిణీ చేశారు. జడ్చర్ల పట్టణానికి చెందిన విక్రమ్ జన్మదినం సందర్భంగా ఇతరుల రాష్టలకు చెందిన 100 మంది వలస కూలీలకు నిత్యావసర సరుకులు అందజేశారు.

mla marri janardhan reddy distributes groceries

ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. మాట్లాడుతూ కరోనా మహమ్మారికి కులం మతం ధనికులు పేద అనే తేడా లేకుండా వ్యాపిస్తుంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఏ పూటకాపూట పని చేసుకుని జీవించే పేదలు తిండి దొరకక ఇబ్బందులు పడుతున్నారని వారిని అన్ని విదాల ఆదుకుంటామన్వారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -