తెలంగాణలో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ పొడగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్గదర్శకాలను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది.
()మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.1000 జరిమానా
()రాష్ట్రమంతటా రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ
()అత్యవసర వైద్య సహాయానికి అనుమతి
()హాస్పిటల్స్, మెడికల్ షాపులు మినహా అన్ని రకాల దుకాణాలు సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలి
()గ్రామీణ ప్రాంతాలు, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో నిర్మాణ కార్యక్రమాలకు అనుమతి
()రెడ్‌జోన్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో స్థానికంగా ఉండే కార్మికులతోనే పని చేయించుకోవాలి
()రెడ్ జోన్స్‌లో రెస్టారెంట్లు, బార్బర్‌షాపులు, స్పాలు, సెలూన్లు, ట్యాక్సీలు, క్యాబ్ సర్వీసులు, ఆటోరిక్షాలకు అనుమతి లేదు.
()ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ట్యాక్సీలకు అనుమతి. వాటిలో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి.
()యథావిధిగా విమాన, రైలు, బస్సు, మెట్రో సర్వీసులపై నిషేధం కొనసాగుతుంది.
()అన్ని విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, శిక్షణ కేంద్రాలు మూసి ఉంచాలి. హోటల్స్, లాడ్జీలు, బార్లు, పబ్‌లు, సినిమా హాళ్లు, థియేటర్లు, షాపింగ్‌మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్‌కాంప్లెక్స్, అమ్యూజ్మెంట్ పార్క్ జూపార్క్, మ్యూజియాలు, ఆడిటోరియాలు బంద్.
అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, బహిరంగ ప్రదేశాలలో పూజలు, మత ప్రార్థనలు నిషేధం
()గ్రామీణ ప్రాంతాల్లో మాల్స్ మినహా అన్ని రకాల షాప్‌లకు అనుమతి. జీహెచ్ఎంసీ, రెడ్‌జోన్ కాని పట్టణాలలో షాప్‌లకు అనుమతి. రెడ్జోన్లు, జీహెచ్ఎంసీలో ఈ కామర్స్ ద్వారా నిత్యావసరాలకే అనుమతి.